Chandrababu: శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి కొడాలి నాని

  • ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పట్టించుకోరు
  • వాళ్లు చనిపోయాక ఉద్ధరిద్దామనుకున్నాను అంటారు!
  • అవతలి వారిపై నిందలు వేయడం బాబుకి అలవాటు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పట్టించుకోరని, అదే, వాళ్లు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తులకు తానే సర్వస్వం అని, వాళ్లను ఉద్ధరిద్దామనుకున్నాను అని అనడం, అవతలి వారి వల్లే ఫలానా వ్యక్తి చనిపోయారనే నిందలు వేయడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటని విమర్శించారు. శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, నాడు ఎన్టీఆర్ విషయంలో, మొన్న నందమూరి హరికృష్ణ విషయంలో, ఈ రోజున కోడెల శివప్రసాద్ విషయంలోనూ చంద్రబాబు అదే చేస్తున్నారని విమర్శించారు.
Chandrababu
Telugudesam
YSRCP
Kodali Nani

More Telugu News