kodela: కోడెల బతికినన్నాళ్లు 'దొంగ' అన్నారు.. నేడు శవరాజకీయాలతో రాజకీయ లబ్ధి ఆశిస్తున్నారు!: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

  • ఏ నేతా ఆయన్ను పరామర్శించలేదు
  • కొడెలతో చెడ్డపేరనీ సొంత పార్టీ నేతలే విమర్శించారు
  • కలికాలం అంటే ఇదే
తెలుగుదేశం నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆత్మహత్య విషయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కోడెల బతికినన్ని రోజులు దొంగ అని అన్నారని వ్యాఖ్యానించారు. ఏ నేత కూడా ఆయన్ను పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.

కొందరు నేతలు అయితే కోడెల కారణంగా ఏకంగా సొంత పార్టీకే చెడ్డపేరు వస్తోందని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలికాలం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు.
kodela
Death
BJP
Vishnuvardhan reddy

More Telugu News