Telangana: ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ కూడా కేసీఆర్ తెలంగాణ అమరవీరులకు ఇవ్వట్లేదు!: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రహ్లాద్ జోషీ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కారు(టీఆర్ఎస్ గుర్తు)లో మజ్లిస్ పార్టీ షికారు చేస్తోందని జోషి విమర్శించారు.

స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే ఉన్నప్పటికీ రిమోట్ మాత్రం మజ్లిస్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తన ఇంట్లో చనిపోయిన కుక్కకు ఇచ్చే విలువను కూడా కేసీఆర్ అమరవీరులకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించారని చెప్పారు. వీరిందరికీ తగిన గౌరవం కల్పిస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
September 17
BJP
Prahlad joshi
criticise

More Telugu News