విజయ్ దేవరకొండ కొత్త సినిమా..‘వరల్డ్ ఫేమస్ లవర్’!
- సినిమాకు క్రాంతిమాధవ్ దర్శకత్వం
- ఈ నెల 20న ఫస్ట్ లుక్ విడుదల
- దేవరకొండకు జంటగా రాశీఖన్నా
క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా నటిస్తోంది. కేథరిన్, ఐశ్వర్య రాజేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తుండగా, గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.