kodela: కోడెల మృతి నేపథ్యంలో.. నరసరావుపేటలో అసాధారణ రీతిలో పోలీసుల మోహరింపు!

  • ఓ ఎస్పీ, 10 మంది డీఎస్పీల ఆధ్వర్యంలో భద్రత
  • ఈ నెల 30 వరకూ 144 సెక్షన్ విధించిన పోలీసులు
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు
తెలుగుదేశం సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. తాజాగా కోడెల మరణం నేపథ్యంలో ఆయన స్వస్థలం నరసరావుపేటలో పోలీసులు భారీగా మోహరించారు.

ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 10 మంది డీఎస్పీలు, 14 మంది సీఐల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా ఈ నెల 30 వరకూ నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు.
kodela
Telugudesam
Death
Narasaraopeta
High security
Police
Guntur District

More Telugu News