kodela: రేపు స్వగ్రామంలో కోడెల అంత్యక్రియలు

  • ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల పార్థివ దేహం
  • గుంటూరులోని పార్టీ కార్యాలయానికి తరలింపు
  • రెండు గంటలపాటు సందర్శకులకు అనుమతి
నిన్న ఆత్మహత్య చేసుకున్న టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు రేపు (బుధవారం) గుంటూరు జిల్లాలోని ఆయన స్వస్థలమైన నరసరావుపేటలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉన్న కోడెల పార్థివదేహాన్ని నేడు విజయవాడ మీదుగా మంగళగిరికి తరలిస్తారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో రెండు గంటలపాటు ఉంచి సందర్శకులను అనుమతిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి నరసరావుపేట తరలిస్తారు. అక్కడ రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
kodela
Guntur District
narasaraopet

More Telugu News