Jagan: మోదీకి ప్రత్యేకంగా ట్వీట్ చేసిన వైఎస్ జగన్!

  • నేడు మోదీ 70వ జన్మదిన వేడుకలు
  • ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ జగన్
  • జాతికి సేవ చేయాలన్న ఏపీ సీఎం
నేడు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో విషెస్ పోస్ట్ చేశారు. "గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం విజయవంతమైన జీవితాన్ని గడపాలని, జాతికి సేవ చేయాలని కోరుకుంటున్నాను" అని జగన్ వ్యాఖ్యానించారు. కాగా, 1950లో పుట్టిన మోదీ, నేడు తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటుండగా, పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
Jagan
Narendra Modi
Birth Day
Wishes
Twitter

More Telugu News