Harish shankar: ఎన్టీఆర్ తో తప్పకుండా హిట్ మూవీ తీస్తాను: దర్శకుడు హరీశ్ శంకర్

  • ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం 
  • ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను 
  • ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటాను
ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేయడంలో హరీశ్ శంకర్ సిద్ధహస్తుడు. అలాంటి హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం రూపొందింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు.

"నేను ఎంతగానో అభిమానించే యువ కథానాయకులలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకి నేను చాలా రుణపడి వున్నాను. 'రామయ్య వస్తావయ్యా' సినిమాతో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి నాలో ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఎప్పటికైనా ఆయనతో మరో సినిమా చేయాలి .. హిట్ ఇచ్చేసి రుణం తీర్చుకోవాలి. ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Harish shankar
Ntr

More Telugu News