Kodela siva prasad: కోడెల భౌతికకాయం ‘ఉస్మానియా’కు తరలింపు.. ‘జోహార్ పల్నాటి పులి’ అంటూ నినాదాలు!

  • పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
  • భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు
  • పోస్ట్ మార్టమ్ తర్వాత కోడెల భౌతికకాయం ఆయన స్వగ్రామానికి తరలింపు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం బసవతారకం ఆసుపత్రి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ‘జోహార్ కోడెల’, ‘జోహార్ పల్నాటి పులి’ అంటూ నినాదాలు చేశారు. పోస్ట్ మార్టమ్ పూర్తయ్యాక కోడెల భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నట్టు సమాచారం. కాగా, కోడెల కుమారుడు శివరామ్ విదేశాల్లో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.
Kodela siva prasad
Telugudesam
Hyderabad

More Telugu News