Rajasekhar: రాజశేఖర్ సరసన నందిత శ్వేత

  • రాజశేఖర్ కొత్త సినిమాకి సన్నాహాలు 
  • జాన్ మహేంద్రన్ అందించిన స్క్రిప్ట్
  • త్వరలోనే సెట్స్ పైకి  
తమిళ .. కన్నడ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేత, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో, అదే తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ట్రాక్ నుంచి బయటపడటానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలలోను, యాక్షన్ డ్రామాలలోను ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

అలా తాజాగా ఆమె రాజశేఖర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. 'కల్కి' తరువాత రాజశేఖర్ .. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నందిత శ్వేత అవకాశాన్ని అందుకుంది. తమిళంలో దర్శకుడిగా .. మాటల రచయితగా మంచి పేరున్న జాన్ మహేంద్రన్ ఈ సినిమాకి స్క్రిప్ట్ ను అందిస్తుండటం విశేషం. టి. ధనుంజయన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Rajasekhar
Nanditha

More Telugu News