టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే పరార్
- ఎమ్మెల్యే కారు ఢీకొని శ్రీకాకుళం వాసి మృతి
- హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘటన
- బాధిత కుటుంబ సభ్యుల ధర్నాతో నిలిచిపోయిన ట్రాఫిక్
కారు దిగిన ఎమ్మెల్యే డ్రైవర్‌తో కలిసి పరారయ్యారు. విషయం తెలిసిన మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.