YSRCP: వందరోజుల పాటు దోచుకోలేకపోయేటప్పటికీ చంద్రబాబుకు పిచ్చెక్కిపోయింది!: అంబటి ఫైర్

  • బాబు పాలనలో అవినీతిని బయటపెడతామని భయం
  • జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ వేశారా? 
  • మీకు ఉన్న అలవాట్లను జగన్ కు అంటగట్టాలని చూస్తారా?
వందరోజుల పాటు దోచుకోలేకపోయేటప్పటికే చంద్రబాబుకు, ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు పిచ్చెక్కిపోయి గందరగోళం సృష్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో అవినీతిని ఎక్కడ బయటపెడతామోనన్న భయంతో వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనలో అవినీతిమయం అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

‘ఎక్కడుంది అవినీతి? జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ వేశారా? సిమెంట్ బస్తాల మీద జగన్ ట్యాక్స్ వసూలు చేశారా? మీకు ఉన్న అలవాట్లను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఎమ్మెల్యేలు దోచుకున్నారని ఆరోపిస్తారా? ఒక్క పైసా కూడా దోచుకునేటటువంటి కార్యక్రమం ఎమ్మెల్యేలు చేయలేదు అని స్పష్టంగా, ధైర్యంగా చెబుతున్నాని అన్నారు.
YSRCP
Ambati Rambabu
jagan
Chandrababu

More Telugu News