KCR: నా వయసు 66 ఏళ్లు... ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకేం కాదు: కేసీఆర్

  • తన ఆరోగ్యంపై దుష్ప్రచారం జరుగుతోందన్న కేసీఆర్
  • వచ్చే రెండు టర్మ్ లు కూడా తానే సీఎం అంటూ ధీమా
  • తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మారథాన్ ప్రసంగం చేశారు. ఏకధాటిగా ఆయన దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. తన ఆరోగ్యంపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన కుమారుడు కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి తాను వైదొలగుతానని ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, తనకు ఇప్పుడు 66 ఏళ్ల వయసని చెప్పారు. మరో రెండు టర్మ్ లు తానే సీఎంగా ఉంటానని, ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా అవి తనకు తగలవని అన్నారు.
KCR
Telangana
KTR

More Telugu News