Chandrababu: గోదావరి పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

  • గోదావరిలో పర్యాటక బోటు మునక
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న చంద్రబాబు
  • బోటులో 61 మంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. త్వరితగతిన స్పందించి గల్లంతైన వారిని కాపాడాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 72 మందితో పాపికొండలు దిశగా వెళుతున్న పర్యాటక లాంచీ వరద ఉద్ధృతి కారణంగా మునిగిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు లైఫ్ జాకెట్ల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నారు. వారిని స్థానికులు ఒడ్టుకు చేర్చారు. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 63 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.
Chandrababu
Godavari
East Godavari District

More Telugu News