Chandrababu: చంద్రబాబు అంటే పవన్ కు ఎందుకో అంత తీపి!: అంబటి రాంబాబు

  • చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారని ఎప్పుడైనా  ప్రశ్నించారా?
  • బాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా?
  • అవినీతికి పాల్పడ్డ వారిని వదలం
వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. మొన్న వరదలకు విజయవాడలోని కృష్ణలంక మునిగిపోతుంటే మంత్రులందరూ చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని బాబు, పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు.

వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్, చంద్రబాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా? ‘ఏమిటో, ఆయన (చంద్రబాబు) అంటే అంత తీపి!’ అని విమర్శించారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారని ఏరోజు అయినా ప్రశ్నించారా? అక్రమ నివాసంలో నివసించడం తప్పు అనే సాహసం ఎందుకు చేయలేదు? అని పవన్ కల్యాణ్ కు సూటి ప్రశ్నలు వేశారు. అవినీతికి పాల్పడ్డ వారిని వదలమని, వాళ్లను బయటపెడతామని టీడీపీ భయపడుతోందని విమర్శించారు.
Chandrababu
ambati
Pawan Kalyan
janasena

More Telugu News