Mahesh Babu: కారును నెడుతున్న మహేశ్ బాబు బావ సుధీర్... వైరల్ వీడియో!

  • పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించనున్న సుధీర్
  • శరీరాకృతిని మార్చుకునేందుకు వర్కవుట్లు
  • వీడియోను పోస్ట్ చేసిన బీఏ రాజు
మహేశ్ బాబు బావ సుధీర్ కారును నెట్టడం ఏంటని అనుకుంటున్నారా? ప్రస్తుతం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించేందుకు రెడీ అవుతున్న సుధీర్, అందుకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకునేందుకు వర్కవుట్లు చేస్తున్నాడు. ఇటీవల తనలోని బలాన్ని పరీక్షించుకునేందుకు ట్రయినర్ సలహాతో కారును నెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సినీ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వీ' అనే సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు కూడా. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
Mahesh Babu
Sudhir Babu
Car
Pullela Gopichand
Biopic

More Telugu News