Vijay Devarakonda: కేటీఆర్ సమాధానంపై కామెంట్ చేసిన విజయ్ దేవరకొండ!

  • తొలి విజయం సాధించాం
  • నల్లమల ప్రజలకు నా మద్దతు
  • నల్లమలను కాపాడుకుందామన్న విజయ్ దేవరకొండ
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. "మనమంతా కలిశాం. మన విజ్ఞప్తులను వారు విన్నారు. నల్లమలను కాపాడుకునేందుకు అడుగులు పడుతున్నాయి. మన ప్రయత్నాలను ఆపవద్దు . అమ్రాబాద్, నల్లమల ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది. నాతో పాటు లక్షలాది మంది సోదర సోదరీమణులు మీ వెనుకే ఉన్నారు" అని వ్యాఖ్యానించాడు. కేటీఆర్ స్పందించడం తాము సాధించిన తొలి విజయమని పేర్కొన్నాడు.
Vijay Devarakonda
Twitter
KTR
Nallamala

More Telugu News