Priyanka Chopra: బ్లాక్ అండ్ వైట్ ఫ్రిల్ గౌన్ లో మెరిసిపోయిన ప్రియాంకా చోప్రా!

  • టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం
  •  'ది స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శన
  • కార్యక్రమానికి హాజరైన చిత్ర యూనిట్
టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో భాగంగా తాను నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శిస్తున్న వేళ, బ్లాక్ అండ్ వైట్ ఫ్రిల్ గౌన్ లో ప్రియాంక మెరిసిపోయింది. ఇంటర్నేషనల్ వేదికలపై తన అందంతో అదరగొట్టే ప్రియాంక, ఈ కార్యక్రమంలోనూ చూపరుల కళ్లు తనవైపే ఉండేలా చేసుకుంది. ఇక ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో మంది పోటీ పడ్డారు.

తనతో పాటు సినిమాలో నటించిన  ఫర్హాన్ అక్తర్, సినిమా దర్శకురాలు సోనాలీ బోస్ తో కలిసి ప్రియాంక ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక సినిమా ప్రదర్శన అనంతరం ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. 15 సంవత్సరాల వయసులోనే రైటర్ గా పేరు తెచ్చుకుని, మరణించిన ఆయేషా చౌదరి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా, ఆయేషా తల్లిదండ్రులుగా ప్రియాంక,  ఫర్హాన్ అక్తర్ లు నటించారు. ఈ పాత్రలో నటించడం తనకు చాలా కష్టమైందని కూడా ప్రియాంక వ్యాఖ్యానించింది.
Priyanka Chopra
Toranto
Canada
Film Festival

More Telugu News