Botsa Satyanarayana: రాజమౌళి గొప్ప దర్శకుడే కావొచ్చు, కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియదు కదా?: బొత్స కీలక వ్యాఖ్యలు

  • విజయనగరంలో బొత్స ప్రెస్ మీట్
  • అమరావతిపై మరోసారి వ్యాఖ్యలు
  • రాష్ట్ర పరిస్థితులు రాజమౌళికి తెలియవని వెల్లడి
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో దర్శకుడు రాజమౌళికి అమరావతి ఆర్కిటెక్చర్ రూపొందించే బాధ్యతలు అప్పగించడంపై బొత్స స్పందించారు. సినిమాల్లో రాజమౌళి చాలా గొప్పవాడు కావొచ్చు కానీ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆయనకు తెలియదని అన్నారు.

దర్శకత్వంలో దాసరి తర్వాత రాజమౌళేనని, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితులు ఏమిటి? అనే విషయాలు ఆయనకు తెలియవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాజమౌళి వ్యవహారం ఒకటని బొత్స పేర్కొన్నారు. కానీ, సీఎం జగన్ అలా కాదని, రాష్ట్రానికి ఏది అవసరమో అదే చేస్తున్నారని స్పష్టం చేశారు.
Botsa Satyanarayana
Rajamouli
Tollywood
YSRCP
Chandrababu
Amaravathi

More Telugu News