Rajasekhar: 'మా' హామీల అమలు కోసం హీరో రాజశేఖర్ రూ.10 లక్షల విరాళం

  • ఆర్నెల్ల కిందట 'మా'కు కొత్త కార్యవర్గం
  • నిధుల కోసం ఈవెంట్లు నిర్వహిస్తామన్న రాజశేఖర్
  • ఇండస్ట్రీలో అందరి సహకారం తీసుకుంటామని వెల్లడి
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హీరో రాజశేఖర్ తమ హామీల అమలుకు తనవంతు విరాళం ప్రకటించారు. 'మా'కు ఆయన రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. అసోసియేషన్ కు మూలధనం ఉన్నా, హామీల అమలుకు దాన్ని ఖర్చుచేయడం భావ్యం కాదని భావిస్తున్నామని రాజశేఖర్ చెప్పారు. అందుకే తనవంతుగా విరాళం ఇచ్చానని, మరిన్ని నిధుల కోసం ఈవెంట్లు నిర్వహిస్తామని అన్నారు. ఇండస్ట్రీలో అందరి సహకారం తీసుకుంటామని, హామీల అమలులో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆర్నెల్ల క్రితం నరేశ్ అధ్యక్షుడిగా 'మా'కు కొత్త కార్యవర్గం వచ్చిన సంగతి తెలిసిందే.
Rajasekhar
Tollywood
MAA

More Telugu News