Chiranjeevi: చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు

  • నరసింహారెడ్డి గురించి మా నుంచి తెలుసుకున్నారు
  • అప్పట్లో మాకు న్యాయం చేస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు
  • ఇంత వరకు న్యాయం చేయలేదు
చిరంజీవి తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు, ఈ చిత్రాన్ని కొన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఈరోజు హైదరాబాదులోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన సమాచారాన్ని తమ నుంచి తీసుకున్నారని... షూటింగ్ కు అవసరమైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవితం గురించి తెలుకున్నారని ఈ సందర్భంగా వారు చెప్పారు. తమకు న్యాయం చేస్తామని ఆ సమయంలో చిరంజీవి హామీ ఇచ్చారని, కానీ, ఇంతవరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు వెళ్లి, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Chiranjeevi
Sye Raa Narasimha Reddy
Tollywood

More Telugu News