Andhra Pradesh: మేం ప్రజలకు జవాబుదారులం.. పచ్చ దొంగలకు కాదు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • రివర్స్ టెండరింగ్ సహా పలు అంశాలపై ఉమ విమర్శలు
  • దేవినేని ఉమకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత
  • త్వరలోనే టీడీపీ అవినీతి బయటపడుతుందని విసుర్లు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తెస్తున్న రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్, పోలవరం కాంట్రాక్టు రద్దు వంటి నిర్ణయాలపై ఉమ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేవినేని ఉమ కొద్దిరోజులు ఓపిక పడితే.. రివర్స్ టెండర్లు, జ్యుడీషియల్ కమిషన్ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

టీడీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల దోపిడీ త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే నాలుగేళ్లలో ఏపీలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారని సాయిరెడ్డి గుర్తుచేశారు. తాము ప్రజలకు జవాబుదారులమనీ, పచ్చదొంగలకు కాదని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News