Daughters-In-Law: అమ్మలా చూసుకున్న అత్త.. కన్నీటితో పాడెను మోసిన నలుగురు కోడళ్లు!

  • మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
  • వయోభారంతో కన్నుమూసిన సుందర్ బాయి
  • తీవ్రంగా రోదించిన నలుగురు కోడళ్లు
సాధారణంగా అత్తను చూసి కొందరు కోడళ్లు వణికిపోతే, మరికొందరు కోడళ్లు మాత్రం తమ అత్తలనే వణికిస్తుంటారు. కానీ కోడళ్లను కన్నబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించే అత్త, అత్తను తల్లిలా చూసుకునే కోడళ్లు కూడా ఉంటారనేందుకు తాజా ఘటన సాక్ష్యంగా నిలిచింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సుందర్ బాయి దగ్డూ(83) ఇటీవల కన్నుమూసింది.

ఆమె బతికిఉన్నంతవరకూ కోడళ్లను ఎంతో ప్రేమతో చూసుకుంది. దీంతో అత్త చనిపోగానే నలుగురు కోడళ్లు లతా, ఉషా, మనీషా, మీనా తట్టుకోలేకపోయారు. ఆమె భౌతికకాయంపై పడిపోయి గుండెలవిసేలా రోదించారు. కట్టుబాట్లను పక్కనపెట్టి ఆమె పాడెను మోశారు. అంతేకాకుండా అత్త సుందర్ బాయి చివరికోరిక ప్రకారం ఆమె కళ్లను దానం చేశారు.
Daughters-In-Law
Break Tradition
Mother-In-Law’s
Funeral Pyre
Maharashtra

More Telugu News