Andhra Pradesh: టీడీపీ కార్యకర్త సలీమ్ పై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేశినేని నాని!

  • కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఘటన
  • టీడీపీ కార్యకర్త సలీమ్ పై ప్రత్యర్థుల దాడి
  • వైసీపీ గూండాలే చేశారన్న కేశినేని నాని
తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జగ్గయ్యపేట వాసి సలీమ్ పై ఇటీవల నలుగురు ప్రత్యర్థులు దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి రమణ, గోపి, పార్థసారథి, మరొకరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే దాడిచేసిన వారంతా వైసీపీ గూండాలేనని విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని ఆరోపించారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సలీమ్ ను ఆయన పరామర్శించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్యతో కలిసి కేశినేని సలీమ్ ను పరామర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వార్తా పత్రికల కథనాలను పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
Twitter

More Telugu News