Anil Kapoor: నా నిత్య యవ్వనానికి కారణం ఇదే: అనిల్ కపూర్

  • దక్షిణాది ఆహారం తీసుకోవడమే నా యవ్వన రహస్యం
  • దశాబ్దాలుగా ఆ ఆహారాన్ని తీసుకుంటున్నాను
  • ముఖ్యంగా ఇడ్లీలు చాలా ఆరోగ్యకరం 
62 ఏళ్ల బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు . ఈ నేపథ్యంలో, తన నిత్య యవ్వనానికి కారణం ఏమిటో ఆయన వివరించారు. దక్షిణ భారతదేశ ఆహారం తీసుకోవడం వల్లే తాను తక్కువ వయసు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నానని తెలిపారు. దక్షిణాది ఆహారంపై తనకు ఎంతో ప్రేమ ఉందని... దశాబ్దాలుగా తాను ఆ ఆహారాన్నే తీసుకుంటున్నానని చెప్పారు. ఇడ్లీ, సాంబార్, దోసలు, అన్నం, రసం, పెరుగు, పచ్చడి తింటుండటం వల్లే తన అసలు వయసు కనిపించడం లేదని తెలిపారు. ముఖ్యంగా ఇడ్లీలు చాలా ఆరోగ్యకరమని, పోషక పదార్థాలు కూడా ఉన్న ఆహారమని చెప్పారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి ఆహారంలో ఇడ్లీలే ఉంటాయని తెలిపారు.
Anil Kapoor
Bollywood

More Telugu News