Guntur District: అరండల్‌పేట పోలీసుల అదుపులో తెలుగు యువత నేత మల్లి

  • వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
  • మల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ
  • పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం
వినాయక నిమజ్జనం సందర్భంగా గుంటూరులోని కొరిటెపాడు సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తెలుగు యువత నేత మల్లిపై పలు ఆరోపణలు చేస్తూ వైసీపీ నేతలు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న మల్లిని అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మల్లి అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగు యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.
Guntur District
telugug yuvatha
malli

More Telugu News