Andhra Pradesh: ఆరుగురు సభ్యులతో కమిటీ నియామకం... ఏపీ రాజధాని నిర్మాణం, అభివృద్ధి పథకాలే అజెండా!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సర్కారు రాజధాని నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పథకాల ప్రణాళికలపై సలహాలు ఇవ్వడమే ఈ నిపుణుల కమిటీ చేయాల్సిన పని. ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఏర్పాటుపై మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

కమిటీ సభ్యులు వీరే...

  • జీఎన్ రావు-రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
  • డాక్టర్ మహావీర్-ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్
  • డాక్టర్ అంజలి మోహన్-అర్బన్ ప్లానర్
  • కేటీ రవీంద్రన్-ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్
  • కేవీ అరుణాచలం-రిటైర్డ్ అర్బన్ ప్లానర్
  • శివానంద స్వామి-సెప్ట్ ఫ్రొఫెసర్


Go Back to Shorts
Andhra Pradesh
Amaravathi
Jagan
YSRCP

More Telugu News