Nara Lokesh: ఈ కొత్త నియంతను ప్రజలే బ్యాన్ చేయబోతున్నారు: నారా లోకేశ్ ట్వీట్

  • పలు చానళ్లపై నిషేధం విధించారంటూ టీడీపీ ఆగ్రహం
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • దొంగబ్బాయ్ అంటూ వ్యాఖ్యలు
పల్నాడు ఘటనలు, ఛలో ఆత్మకూరు సందర్భంగా పలు న్యూస్ చానళ్లపై అప్రకటిత నిషేధం విధించారంటూ టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. తన చేతగాని పాలనను దొంగ చానల్, దొంగ పేపర్ కాపాడలేవని దొంగబ్బాయ్ భయపడ్డారా? అంటూ సెటైర్ వేశారు. మీడియాపై నిషేధం విధించడం ద్వారా 100 రోజుల్లోనే తుగ్లక్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అంగీకరించారని లోకేశ్ ట్వీట్ చేశారు. అధికార మదంతో మీడియా హక్కులను కాలరాయాలని ప్రయత్నించే ఈ సరికొత్త నియంతను ప్రజలే నిషేధించబోతున్నారని పేర్కొన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News