Vijayawada: విజయవాడలో ‘జనసేన’ నుంచి వైసీపీలోకి చేరికలు!

  • విజయవాడలో మంత్రి వెల్లంపల్లి సమక్షంలో కార్యక్రమం
  • జనసేన నాయకుడు రామక‌ృష్ణ సహా 150 మంది చేరిక
  • వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి
జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు మొదలయ్యాయి. విజయవాడలోని జనసేన నాయకుడు ఎంఆర్కే రామకృష్ణ  దాదాపు 150 మంది కార్యకర్తలతో వైసీపీలో చేరారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దేవాలయాల పాలక మండళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామని, స్థానికులకు 75% ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాగా, రామకృష్ణతో పాటు వైసీపీలో చేరిన వారిలో 29,33,38 డివిజన్లకు చెందిన జనసేన నేతలు, 29వ డివిజన్ మైనార్టీ, బీసీ, దళిత నాయకులు ఉన్నారు.
Vijayawada
janasena
YSRCP
vellampally

More Telugu News