Telangana: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ చేసిందేమీ లేదు: బృందా కారత్
- చల్లపల్లిలో వ్యకాస 28వ మహాసభలు ప్రారంభం
- భూ పోరాటాన్ని ఆత్మగౌరవ పోరాటంగా భావిస్తున్నాం
- ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించరు?
కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 28వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. చల్లపల్లి అమరవీరుల స్తూపం నుంచి సభా స్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బృందా కారత్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించట్లేదు? అని ప్రశ్నించారు. గుంటూరు బాపనయ్య జమీందార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన పోరాటాల వల్లే పేదలకు ప్రయోజనం కలిగిందని అన్నారు. భూ పోరాటాన్ని ఆత్మగౌరవ పోరాటంగా భావిస్తున్నామని, రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వీరోచితంగా పోరాటాలు చేశామని చెప్పారు.