Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లాగే ఏపీకి రెండు రాజధానులు ఇవ్వండి: టీజీ వెంకటేశ్

  • రాయలసీమకు రాజధాని ఇవ్వాలన్న టీజీ
  • రాజధాని కోసం శాంతియుత ఉద్యమం చేస్తామని వెల్లడి
  • చంద్రబాబు కారణంగా సీమకు రూ.50 కోట్ల నిధులు ఆగిపోయాయని ఆరోపణ
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరోసారి రాయలసీమకు రాజధాని ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ లాగే ఏపీకి కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు కారణంగా రాయలసీమకు రూ.50 కోట్ల మేర ఉపాధి నిధులు రాలేదని, సీమకు ఆగిపోయిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
Jammu And Kashmir
Andhra Pradesh
TG Venkatesh

More Telugu News