Manchu vishnu: శ్రీ విద్యా నికేతన్ కాలేజీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది!: హీరో మంచు విష్ణు

  • 2018-19 విద్యా సంవత్సరానికి ఈ ఘనత సాధించాం
  • కేంద్ర హెచ్చార్డీ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ నటుడు
ప్రముఖ నటుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. తమ కుటుంబానికి సంబంధించిన శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ దక్షిణ మధ్య జోన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కాలేజీగా నిలిచిందని విష్ణు తెలిపాడు. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ తమ ఇంజనీరింగ్ కళాశాల ఈ ఘనత సాధించిందని వెల్లడించాడు. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నోవేషన్ సెల్ ప్రకటించిందని పేర్కొన్నాడు.

తమ విద్యాసంస్థలో నవకల్పనకు పెద్దపీట వేస్తున్నామనీ, అందుకే ఈ అవార్డు వరించిందని మంచు విష్ణు చెప్పాడు. దేశంలోని 925 విద్యాసంస్థలకు గానూ తమ కాలేజీ టాప్-25లో నిలిచిందనీ, ఇక దక్షిణ మధ్య జోన్ లో మాత్రం టాప్-3లో నిలిచిందని విష్ణు హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు విష్ణు ట్విట్టర్ లో స్పందించాడు.
Manchu vishnu
Sri vidyaniketan
Award
Twitter
HRD

More Telugu News