Nellore: చిన్న కేసు కోసం నాలుగున్నర గంటల విచారణ అవసరమా?: టీడీపీ నేత సోమిరెడ్డి

  • భూ వివాదం కేసులో సోమిరెడ్డిని విచారించిన పోలీసులు
  • పొలానికి సంబంధించిన పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి  
  • కావాలని చెప్పే నాపై కేసు పెట్టి ఇలా చేస్తున్నారు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇమిడేపల్లి భూ వివాదం కేసులో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ చిన్న కేసు కోసం నాలుగున్నర గంటలు తనను విచారణ చేశారని విమర్శించారు. 2.5 ఎకరాల పొలానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. కావాలని చెప్పే తనపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
Nellore
Telugudesam
Somireddy
chandrmohan

More Telugu News