CM Ramesh: సీఎం రమేశ్ ఓ రాజకీయ బ్రోకర్: మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి

  • కడప జిల్లాలో టీడీపీని ఆయన సర్వ నాశనం చేశారు
  • ఇప్పుడు బీజేపీలో చక్రం తిప్పాలని చూస్తున్నారు!
  • రమేశ్ కు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు
బీజేపీ నేత సీఎం రమేశ్ పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ ని ఓ రాజకీయ బ్రోకర్ గా అభివర్ణించారు. కడప జిల్లాలో టీడీపీని ఆయన సర్వ నాశనం చేశారని, ఇప్పుడు బీజేపీలో చక్రం తిప్పాలని చూస్తున్నారని విమర్శించారు. రమేశ్ కు బీజేపీ అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, జిల్లా మొత్తంలో పది వేల ఓట్లు కూడా వేయించలేని వ్యక్తి రమేశ్ అని విమర్శించారు.
CM Ramesh
BJP
varadarajul reddy
Telugudesam

More Telugu News