Temple: జగన్ సర్కార్ కీలక నిర్ణయం... దేవాలయాల పాలకమండళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు

  • పాలకమండళ్లు, ట్రస్టు బోర్డుల్లో రిజర్వేషన్లు
  • మహిళలకు 50 శాతం పదవులు
  • జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలోని దేవాలయాల పాలకమండళ్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాలకమండళ్లు, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. అంతేకాదు, పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Temple
Reservations
Andhra Pradesh
Jagan

More Telugu News