Somireddy: పోలీసుల విచారణకు హాజరైన సోమిరెడ్డి

  • భూ వివాదం కేసులో సోమిరెడ్డికి నోటీసులిచ్చిన పోలీసులు
  • నకిలీ పత్రాలు ఇచ్చారని ఆరోపణలు
  • పోలీసులకు ఒరిజినల్ పత్రాలను చూపించిన సోమిరెడ్డి
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇమిడేపల్లి భూ వివాదం కేసులో సోమిరెడ్డికి 160, 91 సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఆయన వెంకటాచలం పీఎస్ కు వచ్చారు. ఈ భూమికి సంబంధించి నకిలీ పత్రాలు ఇచ్చారని సోమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ సందర్భంగా తన వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలను పోలీసులకు సోమిరెడ్డి చూపించారు. మరోవైపు, పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.
Somireddy
Telugudesam
Land Case

More Telugu News