Modi: మోదీకి కర్ణాటక మంత్రులు, ఎంపీలు భయపడతారనే వార్తల్లో నిజం లేదు: కేంద్ర మంత్రి సదానందగౌడ

  • ప్రతి వారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది
  • ఆ సమాశంలో రాష్ట్ర సమస్యలను చర్చిస్తాం
  • మోదీని కర్ణాటక ఎంపీలు తరచుగా కలుస్తుంటాం
ప్రధాని మోదీకి కర్ణాటకకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు భయపడతారనే వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి సదానందగౌడ తెలిపారు. ప్రతి వారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని.. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు తరచుగా మోదీని కలుస్తుంటామని తెలిపారు.

మోదీకి బయపడతామనే వార్తలు అవాస్తవమని... ప్రధాని స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పారు. దేశమంతా ఒకే చట్టం, ఒకే అజెండా ఉండాలనే లక్ష్యంతో జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని తెలిపారు. బ్యాంకుల విలీనంతో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలికామని చెప్పారు. జీడీపీ త్వరలోనే పుంజుకుంటుందని తెలిపారు. ఉత్తర కర్ణాటకకు త్వరలోనే వరద పరిహారం అందుతుందని చెప్పారు.
Modi
Sadananda Gowda
Karnataka
BJP

More Telugu News