Nara Lokesh: శభాష్ జగన్ గారూ, ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని మళ్లీ రాష్ట్రం మీదికి వదిలారు: నారా లోకేశ్

  • జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • రాక్షసరాజ్యం, వైసీపీ గూండాలు అంటూ విమర్శలు
  • ప్రత్యర్థుల చేతిలో గాయపడిన టీడీపీ కార్యకర్త ఫొటో ట్వీట్ చేసిన లోకేశ్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. శభాష్ వైఎస్ జగన్ గారూ, మీ పాలన అద్భుతం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని మళ్లీ రాష్ట్రం మీదకు వదిలారంటూ ఘాటుగా విమర్శించారు. పేదవాడికి పట్టెడన్నం దొరక్కపోయినా, మీ గూండాల దాహానికి టీడీపీ కార్యకర్తల రక్తం, ఆకలేసినప్పుడు నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 అంతేకాకుండా ఈ రాక్షస రాజ్యంలో ఇంకెంతమంది నెత్తురు చిందించాలంటూ జగ్గయ్యపేటలో ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన షేక్ సలీం అనే టీడీపీ మైనారిటీ కార్యకర్త ఫొటోను ట్వీట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతలు అంటే ఇవేనా హోం మంత్రి గారూ? అంటూ మేకతోటి సుచరితపైనా విమర్శలు చేశారు. ఇతడిని కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? అని నిలదీశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News