Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ రికార్డును బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ!

  • రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • రూ.17.75 లక్షలు రాబట్టిన ఫిలింనగర్ వినాయక్ నగర్ బస్తీ లడ్డూ
  • లడ్డూను దక్కించుకున్న బీజేపీ నేత గోవర్ధన్
హైదరాబాద్ లో గణేశ్ లడ్డూ వేలంలో బాలాపూర్ లడ్డూ గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రతిసారి లక్షల్లో ధర పలుకుతూ కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. ఈసారి కూడా తన రికార్డును తానే అధిగమించిన బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షలు పలికింది. అయితే, ఆ రికార్డు కొన్ని గంటలకే తెరమరుగైంది. ఫిలింనగర్ లోని వినాయక్ నగర్ బస్తీ వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో 17.75 లక్షలు పలికింది. బీజేపీ నాయకుడు గోవర్ధన్ వినాయక్ నగర్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. గతేడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలకగా, బాలాపూర్ లడ్డూ ప్రథమస్థానం దక్కించుకుంది.
Ganesh Laddu
Hyderabad
Balapur
Filmnagar

More Telugu News