Andhra Pradesh: రేపు ఏపీ డీజీపీని కలవనున్న టీడీపీ బృందం

  • వైసీపీ అరాచకాలపై పుస్తకాలను డీజీపీకి అందజేస్తాం
  • వైసీపీ ప్రభుత్వ అరాచకాలను చర్చనీయాంశం చేశాం  
  • టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
రేపు ఏపీ డీజీపీని టీడీపీ బృంద సభ్యులు కలవనున్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై ముద్రించిన రెండు పుస్తకాలను ఆయనకు అందజేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ‘ఛలో ఆత్మకూరు’తో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని అన్నారు. వైసీపీ బాధితుల శిబిరాన్ని విజయవంతంగా నడిపిన కమిటీకి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

కాగా, టీడీపీ సీనియర్ నేతలతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. వైసీపీ అరాచకాలు, అన్యాయాలపై ప్రైవేటు కేసులు వేయాలని, గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని, టీడీపీ ఎంపీలతో వెళ్లి కేంద్రం హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేయాలని తమ నేతలకు సూచించారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
DGP

More Telugu News