Mahesh Babu: విజయశాంతితో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత విజయశాంతి కెమెరా ముందుకు రావడంతో ఈ సినిమాకు మరికాస్త హైప్ ఏర్పడింది. కాగా, విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు.

1989లో 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో ఆమెతో పాటు తాను కూడా నటించానని వెల్లడించారు. విజయశాంతి గారితో నటించడం తనకు అదే ప్రథమం అని వివరించారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతి గారితో నటిస్తుండడం చూస్తుంటే కాలచక్రం గిర్రున తిరిగివచ్చిందన్న ఫీలింగ్ కలుగుతోందని తెలిపారు. అంతేగాకుండా, ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను కూడా ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Mahesh Babu
Vijayasanthi
Tollywood

More Telugu News