Andhra Pradesh: రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు: మంత్రి బొత్స

  • సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
  • చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తున్నారు
  • ఇకనైనా ఇలాంటి పిచ్చివేషాలు వేయడం మానుకోవాలి
రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతిభద్రతలకు ఎటువంటి ఢోకా లేదని చెప్పారు.

రాష్ట్రం ఇలా ఉండటం తట్టుకోలేక చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తున్నారని, ఇలా చేయడం ఆయనకేమీ కొత్త కాదని విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చివేషాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు చక్కగా పనిచేశారని ప్రశంసించారు. వంద రోజుల పాలనలో సంక్షేమానికి జగన్ పెద్ద పీట వేశారని అన్నారు. కొత్త ఆలోచనలతో జగన్ ముందుకు సాగుతున్నారని, చంద్రబాబు మాత్రం తన పాత విధానాలు, కుట్రలతోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
Andhra Pradesh
Jagan
Botsa Satyanarayana
Chandrababu

More Telugu News