Hyderabad: ఫొటో తీశాడని... ట్రాఫిక్ పోలీసును వెంబడించి కొట్టిన హైదరాబాద్ యువకులు!

  • నాంపల్లి, నీలోఫర్ కేఫ్ వద్ద ఘటన
  • ఫొటో తీశాడని దాడికి దిగిన యువకులు
  • యువకులను గుర్తించే పనిలో పోలీసులు
టూ వీలర్ పై ముగ్గురు వెళుతుండగా, చూసిన ఓ ట్రాఫిక్ హోమ్ గార్డు, తన వద్ద ఉన్న కెమెరాతో ఫొటో తీయగా, ఆగ్రహంతో అతన్ని వెంబడించి కొట్టారు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, నీలోఫర్‌ కేఫ్‌ సమీపంలో విధుల్లో ఉన్న హోమ్ గార్డు, అటువైపుగా బైక్‌ పై ట్రిబుల్ రైడింగ్‌ చేస్తున్న యువకులను గమనించి ఫొటో తీశాడు.

తమను ఫొటో తీయడాన్ని చూసిన ఆ యువకులు, బండిని పక్కన ఆపి, దాడికి దిగారు. ఎంతో మంది ఈ ఘటనను చూస్తున్నా, ఆ హోమ్ గార్డుకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో హోమ్ గార్డు, వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
Hyderabad
Traphic
Police
Bike
Triple Riding

More Telugu News