Karnataka: మంచి రోడ్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి: కర్ణాటక డిప్యూటీ సీఎం

  • అధ్వానమైన రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మీడియా ఆరోపిస్తోంది
  • రాష్ట్రంలో ప్రతి ఏటా 10 వేల రోడ్డు ప్రమాదాలు
  • ఎక్కువ ప్రమాదాలు హైవేలపైనే జరుగుతున్నాయి
కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ కొత్త ఆసక్తికర వాదనను తెరపైకి తెచ్చారు. ప్రమాదాలకు అధ్వానమైన రోడ్లు కారణం కాదని... మంచి రోడ్లే కారణమని చెప్పారు. కర్ణాటకలో ప్రతి ఏటా దాదాపు 10 వేల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు అధ్వానమైన రోడ్లే కారణమని మీడియా ఆరోపిస్తోందని... కానీ, ప్రమాదాలకు మంచి రోడ్లే కారణమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎక్కువ ప్రమాదాలు హైవేలపైనే జరుగుతున్నాయిన తెలిపారు. కొత్త వాహన చట్టం కింద అధిక జరిమానాలను విధించడాన్ని తాను సమర్థించనని చెప్పారు. భారీ జరిమానాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Karnataka
Govind Karjol
Road Accident

More Telugu News