PV Sindhu: పీవీ సింధు పేరును పద్మభూషణ్ కు సిఫార్సు చేసిన క్రీడాశాఖ!

  • మేరీ కోమ్ కు పద్మ విభూషణ్
  • గతేడాది కూడా సింధు పేరు పరిశీలన
  • పూర్తిగా మహిళలతో జాబితా

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సీంధు పేరును మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కోసం క్రీడా శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆమెకు అవార్డును ఇవ్వాలంటూ, కేంద్రానికి సిఫార్సులు వెళ్లినట్టు తెలుస్తోంది. 2017లో కూడా ఇదే పురస్కారానికి సింధు పేరు సిఫార్సు అయినప్పటికీ, అవార్డుల కమిటీ మాత్రం ఎంపిక చేయలేదు. ఈ దఫా ఆమెకు పద్మభూషణ్ ఖాయమేనని తెలుస్తోంది.

 ఇదే సమయంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోసం ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్ పేరును కూడా క్రీడా శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలిసారిగా క్రీడా శాఖ పూర్తిగా మహిళలతోనే సిఫార్సు జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. క్రికెటర్ హర్మన్ ప్రీత్ సింగ్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంఫాల్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, షూటర్ సుమా శిరూర్, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్ పేర్లను పద్మశ్రీకి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News