Narendra Modi: వేలానికి మోదీ కానుకలు.. వేలంలో 2700కు పైగా వస్తువులు

  • వేలం ద్వారా వచ్చే సొమ్ము సమాజసేవకు
  • ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలోనూ వేలం
  • అప్పట్లో ఆ సొమ్ము నమామి గంగా ప్రాజెక్టుకు విరాళం
భారత ప్రధాని నరేంద్రమోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన కానుకలను వేలం వేయనున్నారు. దేశ, విదేశాల్లో ఆయన పర్యటించినప్పుడు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేసి వచ్చిన సొమ్మును సమాజసేవకు వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.

దీంతో ఆయన ప్రధాని అయ్యాక ఇప్పటి వరకు వచ్చిన 2700లకు పైగా వస్తువులను వేలానికి సిద్ధం చేస్తోంది. వీటిని ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు. వస్తువుల ధరలు రూ.200 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటాయన్నారు. కాగా, ఈ ఏడాది జనవరి - ఫిబ్రవరి మధ్య కూడా మోదీకి వచ్చిన 1800కుపైగా బహుమతులను వేలం వేశారు. తద్వారా వచ్చిన మొత్తాన్ని నమామి గంగా ప్రాజెక్టుకు విరాళంగా అందించారు.
Narendra Modi
auction
gifts

More Telugu News