Pakistan: ప్రస్తుతానికి చర్చల ప్రసక్తి లేదు!: పాకిస్థాన్

  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు
  • ప్రస్తుతానికి ద్వైపాక్షిక చర్చల అవకాశమే లేదని వ్యాఖ్య
  • మధ్యవర్తిత్వానికి ఎవరైనా ముందుకు రావాలన్న మంత్రి
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతానికైతే ద్వైపాక్షిక చర్చల ప్రసక్తే లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ తేల్చి చెప్పారు. కశ్మీర్‌‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతానికైతే చర్చలు జరిగే అవకాశం లేదన్న ఆయన ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఎవరైనా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
Pakistan
India
Jammu And Kashmir

More Telugu News