Andhra Pradesh: ఏపీని చంద్రబాబు అప్పుల్లో ముంచితే, జగన్ వరదల్లో ముంచుతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • వరద నిర్వహణ చేతకాకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి
  • అంతేతప్ప ప్రజలను ఇక్కట్లపాలు చేయొద్దు
  • తక్షణమే ముంపు బాధితులను ఆదుకోవాలి
ఏపీలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా కృష్ణా, గుంటూరు. ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఆయా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందిపడుతుండటంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వరద నిర్వహణ చేతకాకపోతే నిపుణుల సలహా తీసుకుని పని చేయాలే తప్ప ప్రజలను ఇక్కట్లపాలు చేయడం కరెక్టు కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.

తక్షణమే ముంపు బాధితులను ఆదుకోవాలని, రోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై కన్నా విమర్శలు గుప్పించారు. ‘పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు..వచ్చి జగన్ వరదల్లో ముంచుతున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh
Chandrababu
Jagan
kanna

More Telugu News