'సైరా' హిందీ వెర్షన్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా: తమన్నా
- 'సైరా'లో లక్ష్మి పాత్రలో కనిపిస్తాను
- ఈ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది
- నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో లక్ష్మి పాత్ర ఒకటి
తాజాగా తమన్నా మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'లక్ష్మీ' అనే పాత్రను పోషించాను. ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇంతవరకూ నేను చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడే ఈ సినిమా హిందీ వెర్షన్ కి గాను నా పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాను. ఈ పాత్రలో నటించడం నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. అందరితో పాటు నేను కూడా ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.