YSRCP: 420 తాతయ్యా.. మీ తుగ్లక్ జగన్ కి ఇంత అభద్రతాభావం ఉందని ఊహించలేదు!: బుద్ధా వెంకన్న

  • జగన్, వైసీపీ, ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు
  • విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్యా’ అని సంబోధన! 
  • జగన్ ని ‘తుగ్లక్’ తో పోలుస్తూ బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు
‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంలో పాల్గొనకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ సీఎం జగన్, వైసీపీ, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్యా’ అని సంబోధిస్తూ జగన్ ని తుగ్లక్ తో పోలుస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

‘మీ తుగ్లక్ (జగన్) గారికి  ఇంత అభద్రతాభావం ఉందని ఊహించలేదు. ఈ నిర్బంధాలు, మీడియా ఆంక్షలు నీ సలహానే కదా! 6 నెలల్లో మంచోడిని అనిపించుకుంటా అన్నాడు, 100 రోజులకే చేతులెత్తేశాడు. అయినా మీకు తెలిసింది ముంచడం ఒకటే కదా, ఇంకా మంచి ఎక్కడుంటుంది!’ అని విమర్శించారు.  
YSRCP
Jagan
Telugudesam
Budha venkanna

More Telugu News